తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ ఆదేశాలు.. ఉపాధ్యాయులపై కక్ష సాధింపే' - బండి సంజయ్​ తాజా వార్తలు

BANDI SANJAY: ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పందించారు. ఉపాధ్యాయులపై కక్షతోనే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని విమర్శించారు. తెరాస మంత్రులు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? అని నిలదీశారు.

'ఉపాధ్యాయులు ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపే'
'ఉపాధ్యాయులు ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపే'

By

Published : Jun 25, 2022, 7:59 PM IST

BANDI SANJAY: పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పందించారు. ఉపాధ్యాయులపై కక్షతోనే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని విమర్శించారు. ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమేనని బండి సంజయ్​ ఆరోపించారు. సీఎం కేసీఆర్​ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదని ఆయన ప్రశ్నించారు. మంత్రులు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? అని బండి సంజయ్‌ నిలదీశారు.

ఉపాధ్యాయులపై కక్షతోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.‌ ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమే. కేసీఆర్.. మీ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదు?. మంత్రులు, ఎంపీల ఆస్తి వివరాలు వెల్లడించే ధైర్యముందా?.-బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మరోవైపు విద్యా శాఖ ఉత్తర్వులను పీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఖండించారు. ఉపాధ్యాయులు ఆస్తులను ఏటా వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఉత్తర్వులు ఉపాధ్యాయులను అవమానించినట్లున్నాయని ఆక్షేపించారు. తెరాస పార్టీకి రూ.800 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని.. అవి ఎలా వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెరాస కుటుంబ పార్టీ ఎమ్మెల్యేలు రూ.వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ప్రకటించిన తర్వాతే.. ఉపాధ్యాయుల ఆస్తుల గురించి మాట్లాడాలన్నారు.

విద్యాశాఖ ఉత్తర్వులను ఖండిస్తున్నాం. టీచర్ల ఆస్తుల వివరాలను సమర్పించాలనడం సరికాదు. క్రయ విక్రయాలపై అనుమతి తీసుకోవాలనడంలో అర్థం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు టీచర్లను అవమానించినట్లున్నాయి. ఎమ్మెల్యేల ఆస్తి వివరాలు ప్రకటించాకే.. టీచర్ ఆస్తుల గురించి మాట్లాడాలి. తక్షణమే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి.-కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భువనగిరి ఎంపీ

అసలేమైందంటే..

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ అలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చూడండి..

ఉపాధ్యాయుల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

భార్యను నాలుగో అంతస్తు నుంచి తోసేసిన భర్త.. అదే కారణమా?

ABOUT THE AUTHOR

...view details