Bandi Sanjay about employees transfers : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు వినతిపత్రం అందించారు. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం సీఎం కేసీఆర్‌కు లేదని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు దాటినా ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.
జీవో 317ను వ్యతిరేకించట్లేదు.. సవరించాలనే కోరుతున్నాం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జీవో 317ను సవరించాలని గవర్నర్‌ను కోరాం. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం కూడా లేదా? .రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు దాటింది. ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు. సకల జనుల సమ్మె వల్లే తెలంగాణ సాకారమైంది. ఉద్యోగుల వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు