తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. పీఆర్సీ ఎలా ఇస్తుంది.?: బండి సంజయ్​ - bandi sanjay news

జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎలా ఇస్తుందని ప్రభుత్వాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు చెల్లించడం లేదని అడిగారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గ్రేటర్​లో భాజపా గెలవడంతో ఎల్​​ఆర్​ఎస్​ పారిపోయిందని బండి ఎద్దేవా చేశారు.

bandi sanjay
బండి సంజయ్​

By

Published : Mar 12, 2021, 1:52 PM IST

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్​మెంట్ ఇచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎట్లా ఇస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మంత్రి కేటీఆర్​కు ఎందుకని ప్రశ్నించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని బండి వెల్లడించారు.

తెరాసను ఎందుకు గెలిపించాలి..

అహంకారపూరితంగా ఓట్లు అడగని కేసీఆర్​కు ఓటెందుకు వేయాలో ఆలోచించించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. రాష్ట్రంలో అజాంజాహీ మిల్లు, నిజాం చక్కెర కర్మాగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓయూ, కేయూలను నిర్వీర్యం చేసి నలుగురు అనుచరులకు ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేసీఆర్​కు అనేక సార్లు సవాల్ విసిరినా ఇప్పటి వరకు రాలేదని ఎద్దేవాచేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే ఎన్నికల హామీలు నెరవేరుతాయని బండి సంజయ్​ స్పష్టం చేశారు.

ఓడిపోతామనే భయంతోనే వారికి అపాయింట్​మెంట్లు: బండి సంజయ్​

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయాన్ని కాంక్షిస్తూ పలు పార్టీల ర్యాలీలు

ABOUT THE AUTHOR

...view details