తెలంగాణ

telangana

ETV Bharat / state

BANDI SANJAY: '2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం' - telangana varthalu

పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ప్రజలకు అన్ని విషయాలను వివరించేందుకే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టామని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలిచి తీరతారని బండి సంజయ్​ జోస్యం చెప్పారు.

BANDI SANJAY: '2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం'
BANDI SANJAY: '2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం'

By

Published : Aug 29, 2021, 8:44 PM IST

Updated : Aug 29, 2021, 10:14 PM IST

తెలంగాణలో భాజపా ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గోల్కొండకు చేరుకుంది. పాతబస్తీకి ఎప్పుడైనా వెళ్లి తీరుతామని బండి సంజయ్​ అన్నారు. 2023 ఎన్నికల్లో గెలిచి గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భాజపా ఏ మతానికి వ్యతిరేకం కాదని.. ముస్లింలను కాపాడేందుకే ట్రిపుల్​ తలాక్​ను భాజపా సర్కారు అడ్డుకుందన్నారు. హిందూ మతాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా అడ్డుకుంటామన్నారు. అన్ని వర్గాలకు ప్రధాని ఆవాస్​ యోజన కింద కేంద్రంలోని భాజపా సర్కారు సాయం అందించిందన్నారు.

BANDI SANJAY: '2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం'

పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పాలని డిమాండ్​ చేశారు.తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం పార్టీ వ్యతిరేకించిందని.. వారితో తెరాస చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని ఆయన ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి వెంట ఉండే పార్టీ ఎంఐఎం అని విమర్శించారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచి గోల్కొండ కోటపై జెండా ఎగిరేసి తీరుతామన్నారు. అయోధ్యలో కర సేవకుల త్యాగాలను వృథాగా పోనివ్వమని బండి సంజయ్​ స్పష్టం చేశారు. 371 ఆర్టికల్ రద్దు కోసం అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని... వారి త్యాగాలను వృథాగా పోనివ్వమన్నారు. ప్రజలకు అన్ని విషయాలను వివరించేందుకే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టామన్నారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలిచి తీరతారని బండి సంజయ్​ జోస్యం చెప్పారు.

భారతీయ జనతా పార్టీని మతతత్వపార్టీగా ముద్ర వేసే కుట్ర చేస్తున్నారు. పాతబస్తీని తెరాస, ఎంఐఎం పార్టీలు ఎందుకు అభివృద్ధి చేయట్లేదు. ముస్లిం మహిళలను ఆదుకునేందుకు ట్రిపుల్​ తలాక్​ను అడ్డుకున్నాం. భాజపా ఏ మతానికి వ్యతిరేకం కాదు. హిందూ మతాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా అడ్డుకుంటాం. 2023 ఎన్నికల్లో గెలిచి.. గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడిస్తాం. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి: REVANTH REDDY: చంద్రబాబును అప్పుడెందుకు పొగిడినవ్.. కేటీఆర్​ ఎట్ల గెలిచిండో యాదికిలేదా?

Last Updated : Aug 29, 2021, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details