రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో హైకోర్టు న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావుకు ఓటు వేసి లాయర్లు తమ తడాఖాను చూపించాలని కోరారు.
భాజపాకు ఓటు వేసి లాయర్ల తడాఖా చూపించండి: బండి సంజయ్ - నారాయణ గూడాలో బండి సంజయ్ సమావేశం
న్యాయవాదుల హత్యపై దిల్లీలో ప్రశ్నిస్తుంటే తెలంగాణ పౌరుడిగా తల దించుకునే పరిస్థితి ఎదురైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్‌లో హైకోర్టు న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నడిరోడ్డుపై లాయర్ దంపతుల హత్య జరిగితే.. ఆ ఘటనను ఖండించలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని బండి సంజయ్ విమర్శించారు. అలాంటి తెరాస పార్టీకి ఓట్లు వేస్తారా అని న్యాయవాదులను ఆయన ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదివిన పట్టభద్రుల తీర్పు కోసం యావత్ దేశంలోని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. లాయర్ల హత్యపై దేశ రాజధాని దిల్లీలో ప్రశ్నిస్తుంటే... తెలంగాణ పౌరుడిగా తలదించుకునే పరిస్థితి ఎదురైందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను, ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావును లాయర్లు ఘనంగా సన్మానించారు
ఇదీ చదవండి:జోరుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం