తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికలెపుడొచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధం: బండి సంజయ్ - BANDI SANJAY on elections

హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశం ప్రారంభమైంది. పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆగస్టు 2 నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర నిర్వాహణ కమిటీ బాధ్యులతో బండి సంజయ్‌ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు.

bandi
bandi

By

Published : Jul 27, 2022, 4:46 PM IST

ఎన్నికలెపుడొచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధం: బండి సంజయ్

ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహాక సమావేశం వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలో భాజపాకు అనుకూలమైన మార్పు వచ్చిందని సంజయ్‌ తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రను కాంగ్రెస్, తెరాస తక్కువ అంచనా వేశాయన్నారు. కేంద్ర నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉందని చెప్పారు. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుందని తెలిపారు. పాలమూరులో పాదయాత్ర ద్వారా రాజకీయ సమీకరణాలు మారిపోయాయని స్పష్టం చేశారు. భాజపా అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర తమ ప్రాంతాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధమే. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు భాజపా వైపు చూస్తున్నారు. తెలంగాణలో భాజపాకు అనుకూలమైన మార్పు వచ్చింది. కాంగ్రెస్, తెరాస ప్రజా సంగ్రామ యాత్రను తక్కువ అంచనా వేశాయి. కేంద్ర నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంది. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుంది. పాలమూరులో పాదయాత్ర ద్వారా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. భాజపా అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర తమ ప్రాంతాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.- బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details