Bandi Sanjay on New Medical Colleges to Telangana :రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బండి సంజయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Bandi Sanjay Thanks Prime Minister on Medical Colleges :తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శమని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. ప్రజలపట్ల మోదీకి ఉన్న అభిమానంతో తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని.. రాష్ట్ర సర్కార్ చెప్పడం.. పచ్చి అబద్ధమని బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay Comments on KCR :కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని.. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా లేఖ రాశారని బండి సంజయ్ గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని వివరించారు. ఈ విషయంలో సైంధవునిలా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని మాట్లాడడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.