తెలంగాణ

telangana

ETV Bharat / state

BANDI SANJAY: ఈటలకు బండి సంజయ్ పరామర్శ - ఈటల రాజేందర్​కు చికిత్స్

ప్రజాదీవెన యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ శుక్రవారం​ అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్​లో చికిత్స అందించి... హైదరాబాద్​కు తరలించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈటలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.

BANDI SANJAY
బండి సంజయ్

By

Published : Jul 31, 2021, 11:50 AM IST

Updated : Jul 31, 2021, 2:42 PM IST

అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ను... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. శుక్రవారం ప్రజాదీవెన యాత్రలో మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఉపఎన్నిక సందర్భంగా వీణవంక మండలంలో పర్యటిస్తున్న ఈటల.. యాత్ర మధ్యలో అస్వస్థత చెందారు. ప్రత్యేక బస్సులో వైద్య చికిత్స అందించినా.. జ్వర తీవ్రత ఎక్కువ కావడంతో హైదరాబాద్​ తరలించాలని వైద్యులు సూచించారు.

యాత్ర మధ్యలో ఈటల అస్వస్థతకు గురి కావటంతో.. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా జ్వరం వచ్చినట్లు నిర్ధరించారు. తనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బొడిగ శోభ ఉన్నారు. వైద్య చికిత్సలను పర్యవేక్షించారు. సమాచారం అందుకున్న ఈటల సతీమణి.. హుటాహుటిన కొండపాక చేరుకున్నారు. బీపీ90/60, షుగర్‌ లెవెల్‌ 265గా నమోదైంది. ప్రత్యేక బస్సులో వైద్యులు చికిత్స అందించారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

వాళ్లు రాజీనామా చేయాలి

డాక్టర్ల సలహా మేరకు ఈటలను హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఈటలను... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డి.కె.అరుణ, మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని... కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావొద్దని బండి సంజయ్ సూచించారు. హుజురాబాద్‌లో గెలిచేందుకు ప్రభుత్వం బరితెగించి అడ్డదారులు తొక్కుతుందని ఆయన ఆరోపించారు. ఓట్లను అభ్యర్థించాలి కానీ... కొనుక్కోకూడదన్నారు. ఈటల రాజేందర్‌పై తప్పుడు ఆరోపణలు చేసి వేధిస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కోసమే దళితబంధు పెట్టామని సీఎం ప్రకటించడాన్ని డీకే అరుణ తప్పుబట్టారు. సీఎంగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. దళితుల సంక్షేమ పట్ల చిత్తశుద్ది ఉంటే తెరాసలోని దళిత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్ని కుతంత్రాలు చేసినా హుజురాబాద్ ప్రజలు ఈటల వెంటనే ఉంటారని తెలిపారు. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

ఇదీ చూడండి:ETELA: ఈటల పాదయాత్రకు బ్రేక్... హైదరాబాద్ తరలింపు

Etela: 'కేసీఆర్‌ చేసిన అవమానాలు భరించలేకే ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా చేశారు'

Last Updated : Jul 31, 2021, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details