తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay letter to Kcr: కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ.. ఆ అంశాల ప్రస్తావన.!

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay letter to Kcr) పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారని అడిగారు. ఈ మేరకు కేసీఆర్​కు బండి సంజయ్ లేఖ(Bandi Sanjay letter to Kcr) రాశారు.

bandi sanjay, kcr
బండి సంజయ్, కేసీఆర్

By

Published : Sep 29, 2021, 1:16 PM IST

అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో రెండు పడక గదుల ఇళ్లు ఎన్ని నిర్మించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. రాష్ట్ర ప్రభుత్వాన్ని(Bandi Sanjay letter to Kcr) ప్రశ్నించారు. అందులో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్కలు చెప్పగలరా అని.. సీఎం కేసీఆర్​కు(Bandi Sanjay letter to Kcr) లేఖ రాశారు. లేఖలో పలు ప్రశ్నలు సంధించారు.

2018 ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్‌ హామీని లేఖలో(Bandi Sanjay letter to Kcr) ప్రస్తావించారు. సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ. 5 నుంచి 6లక్షల ఆర్థికసాయం మాట ఏమైందని కేసీఆర్​ను ప్రశ్నిచారు. ఇప్పటివరకు ఒక్కరైనా లబ్ధిదారులు ఉన్నారా..? అని లేఖలో నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం 2లక్షల 91వేల ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసిందని లేఖ(Bandi Sanjay letter to Kcr)లో పేర్కొన్న బండి.. ఎన్ని ఇళ్లు పూర్తి చేశారో చెప్పాలని కోరారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని పూర్తిచేశారని ముఖ్యమంత్రికి రాసిన లేఖ(Bandi Sanjay letter to Kcr)లో బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:Posani vs Pawan issue: పోసానిపై జనసేన ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details