తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay Letter: 'సెర్ఫ్​ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి'

Bandi Sanjay Letter: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మరోసారి బహిరంగ లేఖ రాశారు. సెర్ఫ్‌ కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పుడు పర్మినెంట్ చేస్తుందో ప్రకటించాలని ఆయన డిమాండ్​ చేశారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో తెరాస ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

Bandi Sanjay Letter: 'సెర్ఫ్​ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి'
Bandi Sanjay Letter: 'సెర్ఫ్​ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి'

By

Published : Feb 20, 2022, 7:28 PM IST

Bandi Sanjay Letter: సెర్ఫ్‌ కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పుడు పర్మినెంట్ చేస్తుందో ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. అలాగే వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను సైతం క్రమబద్దీకరించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు.

సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ బహిరంగ లేఖ

సెర్ఫ్‌ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో తెరాస ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడు ఉండబోరని.. వారిని పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. తెరాస ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆక్షేపించారు. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏమయ్యాయని బండి సంజయ్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details