Bandi Sanjay letter to KCR on ORR Dispute : హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు టోల్ టెండర్ల అప్పగింతపై వస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై సీఎం మౌనం ఓఆర్‌ఆర్ టెండర్‌లో భారీ కుంభకోణం జరిగిందనే అనుమానాలను బలపరుస్తోందని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ టెండర్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
టోల్ టెండర్‌లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థలను లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటు అని సంజయ్ ఆక్షేపించారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశముండగా... అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
IRB Legal Notices to Raghunandan Rao : హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లీజ్ వ్యహారంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఐఆర్‌బీ సంస్థ పరువు నష్టం దావా వేసింది. సదరు సంస్థ ఆయనపై రూ.1000కోట్లు పరువు నష్టం వేసింది. ఈ మేరకు ఐఆర్‌బీ సంస్థ రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
ORR.. కేసీఆర్‌కు భవిష్యత్‌లో ఏటీఎం : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ప్రభుత్వం అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్.. భవిష్యత్‌లో సీఎం కేసీఆర్‌కు ఏటీఏంగా మారనుందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేస్తామని పేర్కొన్నారు.