తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడానికి తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మాస్వరాజ్ కృషి ఎంతో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వేలాది మంది బలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని వెల్లడించారు. భాజపా జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌ల జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ వర్క్ షాప్‌కి అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా మోర్ఛా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, దుష్యంత్ కుమార్, బండి సంజయ్, భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గౌతమ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ వర్క్ షాపు ద్వారా తనకు ప్రేరణ, ఉత్సాహం కలుగుతోందని సంజయ్ అన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన పార్టీ జాతీయ నాయకత్వానికి, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా, సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేస్తున్నారు.
బలిదానాలు వృథా కానివ్వబోం
తెలంగాణలో భాజపా సైద్ధాంతిక భావజాలం వ్యాప్తి కోసం, పార్టీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని బండి సంజయ్ గుర్తుచేశారు. వేలాది మంది పోరాటవీరులు నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుల బలిదానాలు వృథా కానివ్వబోమని.. వారి స్ఫూర్తితో జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. ఇందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో కాషాయ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వర్క్‌షాప్‌లో వివిధ రాష్ట్రాల భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు.
గట్టి కౌంటర్లు వేయాలి