Bandi Sanjay fivth Praja Sangrama Yatra postponed: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోయే అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. బండి సంజయ్ ఈ నెల 15 నుంచి అయిదో విడత పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో బండి సంజయ్ తన నిర్ణయాన్ని మార్చుకుని పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.
ఇప్పటికే నాలుగు విడతలుగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించారు. అందులో భాగంగానే ఆక్టోబర్ 15 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయాలని భావించిన మునుగోడు ఉప ఎన్నిక నగారాతో వాయిదా పడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
ఈ నెల 7న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఈ నెల 14 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. 15న పరిశీలన ఉంటుంది. ఈ నెల 17 వరకు ఉప సంహరణకు గడువుంటుంది. వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 6న చేపడతారు.