తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్టీ రిజర్వేషన్లు ఇన్నేళ్లు ఎందుకు అమలు చేయలేదు: బండి సంజయ్ - Gollakurma leaders who met Bandi Sanjay

Bandi Sanjay Fires On KCR: రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు ఇన్నేళ్లు ఎందుకు అమలు చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. భాజపాకు వస్తున్న స్పందన చూసి కేసీఆర్ వణికిపోతున్నారని బండి సంజయ్ విమర్శించారు.

బండిసంజయ్‌
బండిసంజయ్‌

By

Published : Sep 18, 2022, 4:12 PM IST

గొర్రెల పంపిణీ పేరుతో గొల్ల, కుర్మలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారు

Bandi Sanjay Fires On KCR: రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు ఇన్నేళ్లు ఎందుకు అమలు చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. దొంగ జీవోలిచ్చి చేతులు దులుపుకుంటే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. భాజపాకు వస్తున్న స్పందన చూసి కేసీఆర్ వణికిపోతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

గొర్రెల పంపిణీ పేరుతో గొల్ల, కుర్మలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. గొర్రెల పంపిణీ పేరుతో ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును వెంటనే వారికి తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. గొల్ల, కుర్మలు ఎదగకుండా సీఎం కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో బండి సంజయ్‌ని గొల్ల, కుర్మ సంఘం నేతలు కలిశారు. ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

"ఏ పార్టీ ఎటువంటి వారో మీరే తెలుసుకోవాలి. ఈ గొర్రెలకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. గొర్రెల స్కీం కాదు. గొర్రెల స్కాం ఇది. కోట్ల రూపాయలు దండుకున్నారు. వారి డబ్బులు దేనికోసం వాడుకున్నారు. ఈరోజు గొల్ల, కుర్మలకు ప్రభుత్వం గొర్రెలు ఇవ్వడం లేదు. వారికి గొర్రెలు ఇచ్చి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది.' -బండి సంజయ్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక విడుదల.. పలు కీలక విషయాలు వెల్లడి

టైప్​రైటర్స్​కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా'

ABOUT THE AUTHOR

...view details