తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: 'అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్‌కు లేదు' - Laxman bjp mp

Bandi sanjay fires on cm kcr: అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌.. దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళితబంధుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రశ్నించారు.

Bandi sanjay
Bandi sanjay

By

Published : Apr 14, 2023, 1:13 PM IST

Updated : Apr 14, 2023, 1:59 PM IST

'అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్‌కు లేదు'

Bandi sanjay fires on cm kcr: దేశంలో అంటరానితనం, కుల రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించిన మహానీయుడు.. అంబేడ్కర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు బీజేపీ కృషి చేసిందని తెలిపారు.

అంబేడ్కర్ చరిత్రను భావి తరాలకు తెలియజెప్పడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ సర్కారు పంచ తీర్థాలను ఏర్పాటు చేసిందని బండి సంజయ్ అన్నారు. దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా బడుగు, బలహీన వర్గాలే లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏనాడూ అంబేడ్కర్‌ను గుర్తించిన దాఖలాలు లేవని విమర్శించారు.

"ఎన్నికల సంవత్సరం కాబట్టే కేసీఆర్‌కు అంబేడ్కర్ జయంతి గుర్తుకు వచ్చింది. ముఖ్యమంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా దళిత సమాజం క్షమించదు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై రేపు వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. దళిత బంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి"- బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం నిలిచిపోతే.. బీజేపీ పోరాట ఫలితంగా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని విమర్శించారు. తొమ్మిదేళ్ల నుంచి అంబేడ్కర్ జయంతి, వర్ధంతిలకు ఎందుకు నివాళులు అర్పించలేదో.. ఇవాళ సభా వేదికగా దళిత సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు దేశానికి దిక్సూచి అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.

BJP MP laxman fires on kcr:దళితులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా దగా చేశారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే దళితుల ఓట్ల కోసం ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని కేసీఆర్ విస్మరించారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు. దళిత అధికారులను సీఎస్ చేయకుండా అవమానించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. ఎన్నికలు వస్తున్నాయి.. కాబట్టి దళితుల ఓట్ల కోసం ఇవన్నీ చేస్తున్నారు". - లక్ష్మణ్‌, రాజ్యసభ సభ్యుడు. బీజేపీ

ఇవీ చదవండి:

Last Updated : Apr 14, 2023, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details