తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ రైతు ద్రోహిగా చరిత్రలో నిలుస్తారు: బండి సంజయ్ - bandi sanjay fires on cm kcr

దశాబ్ధాల కాలంగా రైతుల జీవితాలు దళారుల చేతిలో నిర్వీర్యం అయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయ రెట్టింపే ధ్యేయంగా బిల్లు తీసుకువస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

bandi sanjay fires on cm kcr
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

By

Published : Oct 3, 2020, 3:15 PM IST

రైతుల సంక్షేమం కోసమే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశంలోని కర్షకులకు సెప్టెంబర్ 26, 2020న నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వార్థపూరిత రాజకీయాలతో నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్ చరిత్రలో రైతు ద్రోహిగా నిలుస్తారని జోస్యం చెప్పారు.

రైతు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా నచ్చిన ధరకు అమ్ముకునే స్వేచ్ఛ కల్పించడం తప్పా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details