తెలంగాణ

telangana

ETV Bharat / state

స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో చర్చ జరగాలి: బండి సంజయ్ - Bandi sanjay comments on speaker

Bandi Sanjay fires on kcr and pocharam ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ముందు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌పైనే చర్యలు తీసుకోవాలని చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay fires on CM kcr and speaker pocharam
స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో చర్చ జరగాలి: బండి సంజయ్

By

Published : Sep 7, 2022, 3:46 PM IST

Bandi Sanjay fires on kcr and pocharam శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ.. రాజకీయ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ముందు స్పీకర్‌పైనే చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు.

పార్టీ కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతో పాటు.. జిల్లా ఇంఛార్జీలతో సంజయ్ సమవేశమయ్యారు. అనంతరం అయన మాట్లాడుతూ... భాజపాని చూస్తేనే కేసీఆర్‌ గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నారని... ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. షరతుల పేరుతో కన్‌ఫ్యూజ్ చేయడం అందులో భాగమేనని చెప్పారు. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందేనని తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details