తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay Latest News : 'దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపి.. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి'

Bandi Sanjay Fires on Party Leaders : దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలని.. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని పార్టీ నేతలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ కోరారు. తన మీద కొంతమంది ఫిర్యాదులు చేశారని.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడిగా తన కర్తవ్యం నెరవేర్చానన్న సంతృప్తి తనకు ఉందని భావోద్వేగంతో చెప్పిన సంజయ్.. పార్టీ సిద్ధాంతం కోసం పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Jul 21, 2023, 4:25 PM IST

Updated : Jul 21, 2023, 5:07 PM IST

Bandi Sanjay Fires on CM KCR : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలపై రానున్న 100 రోజుల పాటు ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్ డ్రామాలు మొదలుపెట్టారని.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులతో ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్‌ను కలిసిన జాతీయ నేతలంతా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ కూటమిలో భాగస్వాములయ్యారని తెలిపారు. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని స్పష్టమవుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగా.. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరై ప్రసంగించారు.

Bandi Sanjay Speech at Party Office : ఈ క్రమంలోనే తనపై పార్టీకి చెందిన కొంతమంది ఫిర్యాదులు చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని.. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండుసార్లు జైలుకు వెళ్లినట్లు గుర్తు చేసుకున్న బండి సంజయ్.. అధ్యక్షుడిగా తన కర్తవ్యం నేరవేర్చానన్న సంతృప్తి తనకు ఉందని స్పష్టం చేశారు. బండి సంజయ్ ముఖ్యం కాదని.. పార్టీ ముఖ్యం అన్నారు. పార్టీ సిద్ధాంతం కోసం పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ హామీలపై 100 రోజులు పాటు ఉద్యమిస్తాం. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్ డ్రామాలు మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులతో ప్రచారం చేయిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ను కలిసిన జాతీయ నేతలంతా కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములు అయ్యారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని స్పష్టమవుతుంది. నా మీద కొంతమంది ఫిర్యాదులు చేశారు. దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి. కార్యకర్తల జీవితాలతో ఆడుకోకండి. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. అధ్యక్షుడిగా నా కర్తవ్యం నేరవేర్చానన్న సంతృప్తి నాకు ఉంది. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

Bandi Sanjay Latest News : 'దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపి.. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి'

మరోవైపు.. రాష్ట్రంలో అన్ని కులవృత్తులను కేసీఆర్ నాశనం చేశారనిబండి సంజయ్ ఆరోపించారు. బీసీలు బీజేపీకి ఓట్లు వేస్తారని రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన ఇచ్చారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ నాటకాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే పీఆర్‌సీ కమిషన్‌ వేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారని.. ఒకవేళ పీఆర్‌సీ వేసినా ప్రభుత్వం అమలు చేయదని విమర్శించారు.

సీఎం కేసీఆర్.. అన్ని కులవృత్తులను నాశనం చేశారు. ఎన్నికలు వచ్చాయంటే నాటకాలు మొదలుపెడతారు. బీసీలు బీజేపీకి ఓట్లు వేస్తారని రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటన ఇచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్‌ ద్వారా చెప్పిస్తున్నారు. - బండి సంజయ్

Bandi Sanjay Latest News : 'దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపి.. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి'

ఇవీ చూడండి..

JP Nadda Appreciate Bandi Sanjay : బండి సంజయ్​కు హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించనుందా..?

Kishan Reddy latest news : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి బాధ్యతల స్వీకరణ

Last Updated : Jul 21, 2023, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details