గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాజపా, మజ్లిస్ పార్టీల మధ్య మాటాల తూటాలు పేలాయి. నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న ప్రభుత్వానికి ధైర్యముంటే... ట్యాంక్‌బండ్‌పై పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. ఒవైసీ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
రెండు గంటల్లోనే దారుస్సలాంను నేలమట్టం చేస్తాం: బండి సంజయ్ - BJP State President Bandi Sanjay Latest Information
హైదరాబాద్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌పై దివంగత నేతలు పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చే దమ్ము మజ్లిస్‌కు ఉందా అని సవాల్ విసిరారు.
![రెండు గంటల్లోనే దారుస్సలాంను నేలమట్టం చేస్తాం: బండి సంజయ్ Bandi Sanjay Fire on Akbaruddin Owaisi Comments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9660497-1105-9660497-1606298743128.jpg)
అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
తెరాస చెప్పినట్లుగా ఆడే మజ్లిస్ పార్టీకి దమ్ముంటే.... పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చాలని సవాల్ విసిరారు. తాము తలుచుకుంటే రెండు గంటల్లోనే దారుస్సలాంను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.
అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
TAGGED:
బండి సంజయ్ తాజా వార్తలు