కరోనాతో బాధపడుతున్న పాల్వాయి హరీశ్ బాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తెల్లవారుజామున అరెస్టు చేశారని మండిపడ్డారు.
పాల్వాయి హరీశ్ బాబు అరెస్టు అప్రజాస్వామికం: బండి సంజయ్
పాల్వాయి హరీశ్ బాబును అరెస్టు చేయడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో బాధపడుతున్న ఆయనను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. గిరిజనుల తరఫున మాట్లాడేవారిని అణచివేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ కామెంట్స్, తెరాసపై బండి సంజయ్ ఆగ్రహం
గిరిజనుల్ని, వారి తరఫున మాట్లాడుతున్నవారిని సీఎం కేసీఆర్ అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అరెస్టులకు భాజపా భయపడదని తెలిపారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడులోనూ గిరిజనులకు మద్దతుగా వెళ్లిన భాజపా నేతలను నెలల తరబడి జైళ్లో పెట్టారని విమర్శించారు. పోడు భూముల సమస్య పరిష్కరించేంత వరకు భాజపా పోరాడుతుందన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రానికి రానున్న 2.7లక్షల వ్యాక్సిన్లు.. బెడ్ల కొరత లేదన్న ఈటల