తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారు' - భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తాజా వార్తలు

ఎన్నికలకు మందు సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత చెప్పే మాటలకు పొంతన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని మాట ఇచ్చి... అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చరని తెలిపారు.

bandi sanjay fire on cm kcr changed his mind after coming to power in telangana
'అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారు'

By

Published : Sep 11, 2020, 11:03 PM IST

అమరుల చరిత్రను తుడిచి వేసి.. చరిత్రలో కేసీఆర్‌ కుటుంబ స్థానం కోసమే తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తలకాయ లేదని అభివర్ణించిన బండి.. తలకాయ లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదన్నారు. సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర విమోచన దినోత్సవంగా జరపాలంటూ భాజపా తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని మాట ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చరాని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ అబద్ధాలతోనే అధికారంలోనికి వచ్చారని.. కేసీఆర్‌ అబద్ధాలకు త్వరలోనే సమాధి కడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపించి... భాజపా సత్తా ఏంటో రుచి చూపిస్తామన్నారు. కేసీఆర్‌ ఒవైసీ కుటుంబం మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఓట్ల రాజకీయం చేస్తున్నారని.. 2024లో భాజపాదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

'అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారు'

ఇదీ చూడండి :'ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం మీద నెట్టడం సరికాదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details