Bandi Sanjay Fire On CM KCR : నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ఖండించారు. నరేంద్ర మోదీ పేరు వింటేనే కేసీఆర్‌కు భయమని ఎద్దేవా చేశారు. ఆయన మాటల వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలతో బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే భావన కలిగించాలని.. తద్వారా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ను దెబ్బతీయాలన్నదే సీఎం కేసీఆర్ వ్యూహమని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమావేశానికి బండి సంజయ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు.
ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్‌ను పెంచేందుకే కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని.. జాకీ పెట్టిలేపినా లేచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేం తీసివేయమని.. మరింత మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడిందని.. అందులోని లోపాలను సరిదిద్ది రైతులకు నష్టం జరగకుండా చూస్తామని మాట ఇచ్చారు.
Bandi Sanjay Tweet On KTR :మిస్టర్ ట్విటర్ టిల్లు పోరాటమే పుట్టిందే ఈ గడ్డలో.. అందరూ కలసి పోరాడితేనే పుట్టింది ఈ రాష్ట్రమంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఒక్కడి వల్ల రాలేదు తెలంగాణ - అందరూ ఒక్కటైతే వచ్చిందే తెలంగాణ అని అన్నారు. మీ నాయన వల్ల రాలేదు తెలంగాణ - ఒక్కడి సొత్తు కాదు తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. అధికార అహంకారం ఎక్కువై అమరుల త్యాగాలను కించపరిస్తే సహించదు తెలంగాణ సమాజమని ట్విటర్ ద్వారా హెచ్చరించారు.