Bandi sanjay Fire On KCR: భాజపా నేతలను గృహనిర్బంధం చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా కార్యకర్తలపై జరిగిన దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రసాదించిన ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలా? నిర్బంధాలు, హౌజ్అరెస్టుల... కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భాజపా అడ్డుకుని తీరుతుందని.. దీని కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.
Bandi sanjay Fire On KCR: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది.. - భాజపా నేతల హౌస్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఫైర్
Bandi sanjay Fire On KCR: భాజపా నేతల గృహనిర్బంధం, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 317 జీవోపై ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులనూ ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు... తెరాస నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గు చేటన్నారు.
Bandi sanjay
నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు, ఉద్యమకారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. కల్వకుంట్ల పాలనలోనూ అదే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధాలతో పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ను ప్రజలు అష్టదిగ్బంధం చేసి ఫాంహౌజ్‌కే శాశ్వతంగా పరిమితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
ఇదీ చూడండి :భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ గృహనిర్బంధం