అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై భాజపా దృష్టి సారించింది. పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావుతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సమావేశమయ్యారు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న దృష్ట్యా.. అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ సమావేశాలపై భాజపా ఎమ్మెల్యేలకు బండి దిశానిర్దేశం
సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ సమావేశాలు: ఎమ్మెల్యేలకు బండి సంజయ్ దిశానిర్దేశం
గతంలో భాజపా నుంచి రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్‌రావు విజయంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. తమకు కేటాయించే సమయాన్ని సద్వినియోగం చేసుకొని.. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా భాజపా వ్యూహాన్ని రచిస్తోంది.
ఇదీ చూడండి: వరంగల్ అర్బన్ జిల్లాలో పట్టభద్రుల పోలింగ్‌కు ఏర్పాట్లు