తెలంగాణ

telangana

ETV Bharat / state

‘సింగరేణి ప్రమాదంపై విచారణ జరపాలి’ - BJP Presodent

సింగరేణి రామగుండం ఓపెన్​ కాస్ట్​ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​  కోల్​ మైన్స్​ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

Bandi Sanjay Demands Singareni Incident Enquir
‘సింగరేణి ప్రమాదంపై విచారణ జరపాలి’

By

Published : Jun 3, 2020, 2:16 PM IST

సింగరేణి రామగుండం ఓపెన్​ కాస్ట్​ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ కోల్​ మైన్స్​ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. సింగరేణిలో ప్రైవేట్​ ఓబీ కాంట్రాక్టర్లు అధికారులకు లంచాలిస్తూ.. అక్షయ పాత్రగా మారారని ఆరోపించారు. కాంట్రాక్టు కేటాయించి.. పనులపై యాజమాన్యం గానీ, అధికారులు గానీ పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని దుయ్యబట్టారు.

కమిషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు నీళ్లు వదలడం వల్లనే గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు సింగరేణి ఓబీ పనుల్లో బినామీలతో కాంట్రాక్టు చేయిస్తున్నారని ఆరోపించారు. వెంటనే విచారణ చేపట్టి మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడమే కాక.. వారి కుటుంబీకులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ABOUT THE AUTHOR

...view details