కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి సుధీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యునిగా, కేంద్రమంత్రిగా సేవలు అందించారని కొనియాడారు. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్ సింగ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు.
జశ్వంత్ సింగ్ మృతి పట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి - భాజపా మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ మృతి
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరణం భాజపాకు తీరని లోటని బండిసంజయ్ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జశ్వంత్ సింగ్ మృతి పట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి
వాజ్‌పేయీ హయాంలో రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించి.. దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చూడండి:కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత