తెలంగాణ

telangana

ETV Bharat / state

కేబుల్‌ రంగంలో తనదైన ముద్ర వేశారు: బండి సంజయ్‌ - బండి సంజయ్​ తాజా వార్తలు

హాత్‌వే డిజిటల్ కేబుల్‌ మాజీ డైరెక్టర్‌ చెలికాని రాజశేఖర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధపడ్డారు. కేబుల్ రంగంలో తనదైన ముద్ర వేసి.. ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

కేబుల్‌ రంగంలో తనదైన ముద్ర వేశారు: బండి సంజయ్‌
కేబుల్‌ రంగంలో తనదైన ముద్ర వేశారు: బండి సంజయ్‌

By

Published : Aug 29, 2020, 4:52 PM IST

హాత్‌వే డిజిటల్ కేబుల్‌ మాజీ డైరెక్టర్‌, వెంకటసాయి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ‌అధినేత చెలికాని రాజశేఖర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేబుల్ రంగంలో తనదైన ముద్ర వేసి.. ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం నిరంతరం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రాజశేఖర్ మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చెలికాని రాజశేఖర్‌ గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో... రాజశేఖర్‌ సుదీర్ఘ కాలంగా సేవలు అందించారు.

ఇదీ చూడండి:'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ABOUT THE AUTHOR

...view details