తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు' - బండి సంజయ్​ తాజా వార్తలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంపట్ల కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి క్రియాశీల పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే ప్రణబ్‌ మరణం తీరని లోటని ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

'ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు'
'ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు'

By

Published : Aug 31, 2020, 8:20 PM IST

Updated : Aug 31, 2020, 9:59 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపట్ల కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి క్రియాశీల పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఒక మంచి నాయకుడిని కోల్పోవడం భారత జాతికి తీరని లోటన్నారు. తెలంగాణ ఏర్పడిన చారిత్రక సందర్భంలో తనదైన పాత్ర పోషించారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో పాల్గొన్న ఏకైక వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. భారతదేశానికి రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని.. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. ప్రణబ్‌ ముఖర్జీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు బండి సంజయ్‌ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

'ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు'

ఇదీ చదవండి:భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

Last Updated : Aug 31, 2020, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details