Bandisanjay fires on CM KCR : సీఎంఓలో కొంతమందితో కేసీఆర్ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డుపెట్టుకుని ఏటా వెయ్యి కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఈ చివరి ఘడియల్లోనైనా ఆ అధికారులు ఆలోచనను మార్చుకుని తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేయాలని కోరారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో బండి సజయ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర ఆయన కుమార్తె పాయల్ నేహాను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి ఎస్.కె.జయచంద్ర, ఆయన కుమార్తె పాయల్ నేహాలు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా చాలా మంది నేతలు పార్టీ చేరబోతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే మేధావి వర్గం బీజేపీలో చేరాలని విజ్ఞప్తి చేశారు.
Bandi Sanjay on eetala : రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారంలో.. వాస్తవం లేదు
Bandi Sanjay condemned Harish Rao comments : గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌పై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రబ్బరు స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే బీఆర్‌ఎస్‌కు నచ్చుతారని ఎద్దేవా చేశారు. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్‌ఎస్‌కు నచ్చడం లేదని ఘాటుగా విమర్శించారు. గవర్నర్‌ను హేళనకు గురిచేయడం రాజ్యాంగాన్ని అవమానించటమేనన్నారు.