Bandi Sanjay fires on CM KCR : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తే... స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అస్వస్థతగా ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బీజీ షెడ్యూల్ ఏముందన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ప్రధానిని అవమానిస్తే సీఎం కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలన్నారు. సీఎం కేసీఆర్ కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
'ప్రధాని వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ కేసీఆర్‌కు ఏముంది?' - తెలంగాణ తాజా వార్తలు
Bandi Sanjay fires on CM KCR : ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ సీఎం కేసీఆర్‌కు ఏముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రాకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళిసై, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అస్వస్థత కారణంగా కేసీఆర్ పాల్గొనలేదు. సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే రామానుజాచార్య విగ్రహావిష్కరణలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.
ఇదీ చదవండి:నాలుగో రోజు సహస్రాబ్ది ఉత్సవాలు.. ప్రధాని రాక దృష్ట్యా క్రతువుల్లో స్వల్ప మార్పులు..