తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త రేషన్​ కార్డులు మంజూరు చేయకపోవటంపై ఎన్​హెచ్​ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు - హైదరాబాద్ తాజా వార్తలు

Bandi Sanjay Complaint: రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు విధించిన నిబంధనలపై దర్యాప్తు చేయాలన్నారు. రేషన్‌ కార్డుల జారీపై నిషేధాన్నివెంటనే తొలగించేలా ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్​హెచ్​ఆర్సీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

బండి సంజయ్
బండి సంజయ్

By

Published : Jun 26, 2022, 12:50 PM IST

Updated : Jun 26, 2022, 12:55 PM IST

Bandi Sanjay Complaint: రాష్ట్రంలో రేషన్‌ కార్డులను రద్దు చేయడం సహా కొత్తవి మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 19 లక్షల రేషన్‌ కార్డులు.. కొత్తవాటి మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు జరపాలని ఎన్​హెచ్​ఆర్సీని కోరారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డుల మంజూరుపై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

తెరాస సర్కారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 19 లక్షల రేషన్‌ కార్డులు రద్దుచేశారని తెలిపారు. కొత్తరేషన్‌ కార్డులు కావాలంటూ తెలంగాణలో ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. జూన్‌ 2021 నుంచి కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులను మీసేవ సెంటర్లు ఆమోదించడం లేదని ఫిర్యాదులో బండి సంజయ్ పేర్కొన్నారు.

Last Updated : Jun 26, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details