తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు' - సీఎం కేసీఆర్​పై మండిపడ్డ బండి సంజయ్​

పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని భాజ‌పా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినా కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు.

bandi-sanjay-comments-on-why-cm-kcr-silent-on-pothireddypadu
'పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు'

By

Published : Aug 8, 2020, 9:49 PM IST

నదీ జలాల వివాదం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు.... సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని భాజ‌పా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నీటిని ఏపీ తరలించే విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని నిల‌దీశారు.

కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

'పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు'

ఇదీ చూడండి :'సీఎం రిలీఫ్ ఫండ్ నిధులపై లెక్కలు చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details