తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు: బండి సంజయ్​ - నిరుద్యోగుల ఆత్మహత్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారి పట్ల సీఎం కేసీఆర్​ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

bandi sanjay comments on cm kcr
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

By

Published : Apr 7, 2021, 10:22 PM IST

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యల పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదని విమర్శించారు. రోజుకు ఒకరు బలవుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదన్న బాధతోనే నిరుద్యోగులు చనిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తరవాత కూడా యువత ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారో సీఎం స్పష్టం చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:అక్రమ రవాణా.. 113 కేజీల గంజాయి సీజ్‌

ABOUT THE AUTHOR

...view details