తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ వైఖరి నచ్చకే తెరాస నేతలు భాజపాలో చేరుతున్నారు' - bandi sanjay latest news

BANDI SANJAY ON JOININGS: తెలంగాణలో కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని, కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తెరాసకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

'కేసీఆర్ వైఖరి నచ్చకే తెరాస నేతలు భాజపాలో చేరుతున్నారు'
'కేసీఆర్ వైఖరి నచ్చకే తెరాస నేతలు భాజపాలో చేరుతున్నారు'

By

Published : Jun 26, 2022, 7:38 PM IST

BANDI SANJAY ON JOININGS: కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి.. కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో తెరాస నేత సామ వెంకట్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులు.. మాజీ కార్పొరేటర్, తెరాస నేత నవతా రెడ్డి, కృష్ణా నాయక్‌ తదితరులు సంజయ్ సమక్షంలో పార్టీలో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ పార్టీని, పార్టీ సిద్ధాంతాన్ని, ప్రధాని మోదీని నమ్మి భాజపాలో చేరిన వారందరికీ స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ వైఖరితో చాలా మంది తెరాస నేతలు భాజపాలో చేరుతున్నారని పేర్కొన్నారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్‌ అనుకుంటుంటే.. కూతురు, అల్లుడు సైతం సీఎం పదవి కావాలనుకుంటున్నారని అన్నారు.

భాజపా ఒత్తిడిని తట్టుకోలేకే..: మరోవైపు ఉపాధ్యాయులు ఏటా స్థిర, చర ఆస్తుల వివరాలు ప్రకటించాలని శనివారం పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపైనా బండి సంజయ్​ స్పందించారు. భాజపా ఒత్తిడిని తట్టుకోలేకే ఇచ్చిన జీవోను మళ్లీ వెనక్కి తీసుకున్నారని అన్నారు.

ఉద్యమ ద్రోహులకు తెరాసలో పదవులు ఇస్తున్నారు. అది భరించలేక భాజపాలో చేరికలు పెరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్‌ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మహిళలకు రక్షణ లేదు.-బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'కేసీఆర్ వైఖరి నచ్చకే తెరాస నేతలు భాజపాలో చేరుతున్నారు'

ఇవీ చూడండి..

'చరిత్రలో నిలిచిపోయేలా ప్రధాని మోదీ సభ.. 10 లక్షల మంది జనసమీకరణ'

'ఆ 40 మంది బతికి ఉన్న శవాలు.. వచ్చాక అక్కడికే పంపిస్తాం'

ABOUT THE AUTHOR

...view details