తెలంగాణ

telangana

ETV Bharat / state

'సన్నవడ్లకు మద్దతు ధర విషయంలో ఎందుకు మాట్లాడలేదు' - Bandi Sanjay Comments on TNGO Leaders

ఉద్యోగుల సమస్యలపై పోరాడాల్సిన నాయకులు ముఖ్యమంత్రికి మద్దతు పలుకుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. టీఎన్జీవోకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని సీఎంకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. సన్నవడ్లకు మద్దతు ధర, బోనస్ విషయంలో ఉద్యోగ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు.

bandi sanjay fire on tngo union
'సన్నవడ్లకు మద్దతు ధర విషయంలో ఎందుకు మాట్లాడలేదు'

By

Published : Dec 8, 2020, 3:32 AM IST

టీఎన్​జీవో నాయకులకు బంద్​తో సంబంధం ఏంటని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నాయకులు ముఖ్యమంత్రికి మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్​సీల గురించి మాట్లాడాల్సిన నాయకులు.. తెరాస రాజకీయ ప్రయోజనాలకై ప్రకటనలిస్తున్నారని దుయ్యబట్టారు.

ఆ సంఘాల నేతలు కేసీఆర్​తో కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. అసలు రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్​లో ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు జోక్యం చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఉద్యోగ సంఘాల నాయకులపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఇప్పుడు ప్రకటనలిస్తున్న నాయకులు సన్నవడ్లు, రుణమాఫీలపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. సన్నవడ్లకు కనీస మద్దతు ధర, బోనస్ విషయంలో ఉద్యోగ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఉద్యోగుల మనోభావాలను కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారదని.. ఎప్పటికీ ఒకే పార్టీ అధికారంలో ఉండదు అనే విషయాన్ని ఉద్యోగ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఇదీ చూడండి :'భారత్​ బంద్​'కు ఆర్టీసీ సంఘాల మద్దతు

ABOUT THE AUTHOR

...view details