తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: 'గ్రూప్‌ సర్వీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి'

Bandi Sanjay: రాష్ట్రంలో గ్రూప్‌ సర్వీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. వేలాది గ్రూపు సర్వీస్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన నత్తనడకన సాగుతోందని ఆయన ప్రకటన విడుదల చేశారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందడంలేవని విమర్శించారు.

Bandi Sanjay: 'గ్రూప్‌ సర్వీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి'
Bandi Sanjay: 'గ్రూప్‌ సర్వీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి'

By

Published : Jan 20, 2022, 8:29 PM IST

Bandi Sanjay: గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. వేలాది గ్రూపు పోస్టులు ఖాళీగా ఉండటంతో పాలన నత్తనడకన సాగుతోందని విమర్శించారు. పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అందకుండా పోతున్నాయని ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600 గ్రూప్‌ -1 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ.. పదేళ్లుగా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు.

గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్‌ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందని.. ఒక్కో ఐఏఎస్‌ అధికారి 3,4 పోస్టులకు ఇంఛార్జిగా కొనసాగుతున్నారని బండి సంజయ్ తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో 4వేలు గ్రూప్‌-2, గ్రూపు-3పోస్టులు 2వేలు, గ్రూప్-4 పోస్టులు 40వేలు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లా, డివిజన్‌, మండలస్థాయి ఆఫీసుల్లో 25ఏళ్లుగా జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని.. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details