తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చలనం లేదు : బండి సంజయ్ - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజా సమాచారం

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ పూర్తిగా బోగస్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండి పడ్డారు. ప్రజలు ప్రభుత్వ మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు భాజపా ప్రణాళిక సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.

bandi sanjay comment on cm kcr state is not at least in motion
రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చలనం లేదు : బండి సంజయ్

By

Published : Jul 22, 2020, 7:01 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ పూర్తిగా బోగసని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం మాటలు నమ్మి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల జిల్లాల్లోనూ కరోనా విజృంభిస్తోందని దుయ్యబట్టారు.

మీ నాయకులకు కరోనా సోకితే కార్పొరేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటారు కానీ పేద ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సర్కారు దవాఖానలపై ప్రభుత్వ వైద్యులకే నమ్మకం లేక... కార్పొరేట్ ఆస్పత్రుల వైపు చూస్తున్నారని.. పేదలైతే ప్రాణాలే కోల్పోతున్నారని ఆక్షేపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చలనం లేదు : బండి సంజయ్

ఇదీ చూడండి :ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్‌ రావు

ABOUT THE AUTHOR

...view details