Bandi Sanjay Chit Chat With Media : బీజేపీలో సీనియర్లంటే బాస్లనీ.. కానీ కాంగ్రెస్‌లో హోంగార్డులతో సమానమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లే గల్లంతు చేసుకుంటోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం తనకు చేతకాదని.. ఆయనలాగా ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం తెలియదని బండి సంజయ్ విమర్శలు చేశారు. తనకు పార్టీ నడపడం రాదని చెబుతున్న రేవంత్.. ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలను అడిగితే తెలుస్తోందని తెలియజేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో పార్టీని ఎవరు బాగా నడుపుతున్నారో.. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో ప్రజలే గమనిస్తున్నారన్నారు.
Bandi Sanjay Comments On Congress : హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదో తెలంగాణ ప్రజానికం ఆలోచించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు క్యాండెంట్లు దొరకడం లేదని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపైనే సోషల్ మీడియాలో విమర్శలు చేయడం తనకు చేతకాదని బండి సంజయ్ అన్నారు. తాము గెలుపు పరంపరను కొనసాగిస్తే.. కాంగ్రెస్ ఓటముల పరంపర కొనసాగిస్తోందన్నారు.