తెలంగాణ

telangana

ETV Bharat / state

BANDI SANJAY: 'ఎంఐఎంతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటి?' - BANDI SANJAY fires on mim

ఎంఐఎం పార్టీతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేవలం 12 శాతం ఓట్లకు కక్కుర్తిపడి ఓ వర్గానికి తెరాస కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు సంజయ్‌ స్పష్టం చేశారు.

BANDI SANJAY
BANDI SANJAY

By

Published : Aug 30, 2021, 5:11 PM IST

Updated : Aug 30, 2021, 5:37 PM IST

BANDI SANJAY: 'ఎంఐఎంతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటి?'

తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టుపెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా ఆరె మైసమ్మ దేవాలయం వద్ద సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, తెరాసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 111 రద్దు చేస్తామని చెప్పి ఎందుకు వెనక్కి తగ్గారని బండి సంజయ్‌ ప్రశ్నించారు. 12 శాతం ఓట్లకు కక్కుర్తి పడి ఓ వర్గానికి తెరాస కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎంఐఎం పాల్గొనలేదన్న సంజయ్‌.. ఎంఐఎం పార్టీతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటని ప్రశ్నించారు.

కేసీఆర్ సీఎం అయ్యాక నిజాం సమాధి వద్ద మోకరిల్లారని సంజయ్​ ఆరోపించారు. ఒక్క కుటుంబం చేతిలో బంధీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కుటుంబంపై ఎన్ని కేసులున్నాయో స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.

ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు సంజయ్‌ స్పష్టం చేశారు. తామూ ఏ పార్టీకి వ్యతిరేకం కాదని.. అయితే 80 శాతం ఉన్న హిందువులను సంఘటితం చేసేందుకు పనిచేస్తామని స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీదనే భాగ్యనగరంగా పేరొచ్చిందని బండి అన్నారు.

ప్రభుత్వ భూముల వేలంపైనా స్పందించిన సంజయ్​.. కోకాపేటలో దళితుల భూములను వేలం వేయడాన్ని భాజపా ఖండిస్తోందని స్పష్టం చేశారు. భాజపా అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకొని.. హిందువులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కాషాయ శ్రేణులంతా.. 2023లో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

'భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుమీదనే భాగ్యనగరం అని పేరొచ్చింది. గోల్కొండ కాదు.. గొల్లకొండ.. గొల్ల కురుముల కొండ. 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాబోతోంది. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకొని.. హిందువులకు అప్పగిస్తాం. ఉద్యమ సమయంలో నిజాంను తిట్టిన ముఖ్యమంత్రి.. సీఎం అయ్యాక నిజాం సమాధి వద్ద మోకరిల్లారు. జీవో 111 రద్దు చేస్తావని చెప్పినవ్​.. ఎందుకు రద్దుచేయలేదు.. దాని వెనుక ఉన్న మర్మమేంటి.. కోకాపేటలో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టాలిచ్చారు. ఇవాళ తెరాస ప్రభుత్వం వచ్చాక ఆయా భూములను వేలం వేసే పరిస్థితి వచ్చిందంటే.. రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవాలి.'

- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీచూడండి:BANDI SANJAY: భాజపా ఎప్పటికీ తెరాసతో కలిసి పోటీ చెయ్యదు

Last Updated : Aug 30, 2021, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details