తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay America Tour : అమెరికాలో బండి సంజయ్ పర్యటన.. అమెరికన్​ ప్రోగ్రెసివ్​ తెలుగు అసోసియేషన్​ 15వ వార్షికోత్సవంలో ప్రసంగం - బండి సంజన్ అమెరికా పర్యటన

Bandi Sanjay To Visit America : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్​ 2న అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్​ ప్రోగ్రెసివ్​ తెలుగు అసోసియేషన్​) 15వ వార్షికోత్సవంలో బీజేపీ ఎంపీ ప్రసంగించనున్నారు. పలు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవా, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.

Bandi Sanjay
Bandi Sanjay To Visit America

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 12:11 PM IST

Bandi Sanjay To Visit America : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 1 శుక్రవారం తెల్లవారుజామున బండి సంజయ్ అమెరికాకు ప్రయాణమయ్యారు. పది రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. సెప్టెంబర్​ 2న అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్​ ప్రోగ్రెసివ్​ తెలుగు అసోసియేషన్​) 15వ వార్షికోత్సవంలో బండి సంజయ్​ ప్రసంగించనున్నారు. అనంతరం వివిధ రాష్ట్రాలలో ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ ఆధ్వర్యంలో పబ్లిక్​ మీటింగ్​ జరుగబోతున్నట్లు ఆఫ్-బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్ , ఆఫ్-బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి ఏనుగుల తెలిపారు.

Bandi Sanjay America Tour : ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, లీడ్ వాలంటీర్లు శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదీ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో ఆరు పట్టణాల్లో ఆత్మీయ సదస్సులు (మీట్ అండ్ గ్రీట్) జరుపనున్నారు.

అమెరికాలో బండి సంజయ్ షెడ్యూల్

  • సెప్టెంబర్ 3న అట్లాంటా
  • సెప్టెంబర్ 4న వివేక్ హాల్ (ఛార్లెట్) నార్త్ కారోలినా
  • సెప్టెంబర్ 5న సీసన్స్ @ తాండూర్ బాన్​క్వెట్​ హాల్ (ర్యాలీ) నార్త్ కెరోలినా
  • సెప్టెంబర్ 6న (ఫెయిర్ ఫాక్స్) వర్జీనియా
  • సెప్టెంబర్ 8న (హాలిడే ఇన్ హాజలెట్) న్యూ జెర్సీ
  • సెప్టెంబర్ 9న (ప్లేనో-డల్లాస్ )

Bandi Sanjay in BJP sabha : 'కిషన్ రెడ్డి నాయకత్వంలో.. కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం'

టెక్సాస్​లో జరిగే ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీలో బండి సంజయ్ పాల్గొని, ప్రసంగించనున్నారు. పలు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవా, నాటక రంగాలకు చెందినప్రముఖులు పాల్గొననున్నారు. అలాగే అమెరికాలోని వివిధ నగరాల్లో పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులతో ఎన్నారైలతో మాట్లాడుతారు. అమెరికా పర్యటనను ముగించుకుని సెప్టెంబర్ 10న ఆయన స్వదేశానికి తిరిగి రానున్నారు.

Bandi Sanjay on BRS MLA Tickets : '115 మందిలో సగం మందికి కేసీఆర్ బి ఫామ్‌ ఇవ్వరు'

వీరి పర్యటనకు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రవాస విద్యార్థి పరిషత్ పూర్వ విద్యార్థులు భారతీయ జనతా పార్టీ మిత్ర సంఘానికి చెందిన మిత్రులు వంశీ యంజాల, శ్రీనివాస్ నాతి, రాజు కుర్రపాటి, సుభాష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి యేలు, లక్ష్మీనారాయణ పెరి, సాయి సూదిని, అజయ్, శేఖర్ నల్లబోతుల, వినయ్, సంపత్, సుధాకర్, రఘు, వికాస్, కార్తికేయ, వికాస్, శ్యామసుందర్, నికేత్ సాయిని, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట , శ్రీకాంత్ తుమ్మల, రమేష్ కలవల, సంతోష్ వేముల, కృష్ణా గుడిపాటి, ఉపేన్ నందిపల్లి, గోవింద్ రాజులు, రఘు, విజయ్ కుందూరు, శరత్ వేముల, గోపీ సముద్రాల, రామ్ వేముల, కృష్ణా, శంకర్ రెడ్డి, ఆదిత్య, రామకృష్ణ జీవీఎస్, గోపి చిలుకూరు, శ్రీనివాస్, శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదీని, జంబుల విలాస్ రెడ్డి అమెరికాలో వివిధ నగరాలలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.

Bandi Sanjay Interesting Comments on Assembly Elections 2023 : 'ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న దానిపై చర్చ జరగలేదు'

Bandi Sanjay Cycle Ride : సైకిలెక్కిన బండి.. పిల్లలతో సరదాగా ముచ్చట్లు

ABOUT THE AUTHOR

...view details