మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్లను నియమించారు. కో ఆర్డినేటర్‌గా పేరాల శేఖర్ రావు, జాయింట్ కో ఆర్డినేటర్‌గా ఎన్వీఎస్ ప్రభాకర్, సుభాష్ చందర్జీ, శ్రీవర్ధన్ రెడ్డిలను నియమిస్తున్నట్టు ప్రకటించారు.
'పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా గెలిపించే దిశగా పనిచేయండి’ - బండి సంజయ్
త్వరలో జరుగనున్న మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కో-ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్లను నియమించారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా గెలుపొందే దిశగా పని చేయాలన్నారు.
'పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా గెలిపించే దిశగా పనిచేయండి’
పట్టభద్రుల ఓట్లు భాజపాకే పడేలా.. వారిని జాగృతం చేయాలని ఇంఛార్జిలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకొని గెలుపు దిశగా కష్టపడాలని మార్గదర్శకాలు చేశారు.
ఇదీ చదవండి:వెంటిలేటర్ల తయారీలో భారత్ భేష్