స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు నిచ్చిన బంద్ ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. భాజపా మినహా ఏపీలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది.
ఏపీ బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు
విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి పిలుపుతో ఏపీ బంద్ కొనసాగుతోంది. ముందస్తుగా ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 వరకు డిపోలకే పరిమితమవనున్నాయి. గమ్యస్థానాలకు వెళ్లలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్ర బంద్: డిపోలకే పరిమితమైన బస్సులు
గమ్యస్థానాలకు వెళ్లలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడబోమని.. మధ్యాహ్నం తర్వాత రోడ్ల మీద తిరుగుతాయని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
ఇదీ చూడండి:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్త బంద్