ఏపీలో జైల్ భరో కార్యక్రమంలో మహిళలపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఐకాస నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌లో భాగంగా రాజధాని గ్రామాలలో అన్నదాతలు ఆందోళన ఉద్ధృతం చేశారు. మందడంలో దుకాణాలను రైతులు దగ్గరుండి మూయించారు. కృష్ణాయపాలెంలో మహిళలు, రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ - ap news
ఏపీ రాజధాని గ్రామాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. 29 గ్రామాల్లో అమరావతి ఐకాస బంద్‌కు పిలుపునిచ్చింది.
రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారిని వెంటనే బయటికి పంపించాలని... లేకపోతే సోమవారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
ఇదీ చూడండి :18 ప్రశ్నలకు జవాబివ్వాలంటూ బండి సంజయ్‌కు హరీశ్ లేఖ