ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హిమాచల్‌ప్రదేశ్ రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ యజ్ఞం నిర్వహించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బండారు దత్తాత్రేయ - UGADI FESTIVAL LATEST NEWS
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌లో యజ్ఞం నిర్వహించారు. కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని వేడుకున్నారు.
BANDARU DATTATREYA UGADI WISHES
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్నవేళ ప్రజలందరూ మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని దత్తాత్రేయ సూచించారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకై ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఉగాది పచ్చడి సేవించారు. పండగ విశిష్టతను తెలిపేలా ఉగాది పచ్చడి ప్రసాదాలను రాజ్‌భవన్ సిబ్బందికి అందజేశారు.
ఇదీ చూడండి: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు