తెలంగాణ

telangana

ETV Bharat / state

మే రెండున రాష్ట్ర బంద్​: బండారు దత్తాత్రేయ

విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. మే రెండో తేదీన భాజపా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చిందని తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు బంద్​ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Apr 30, 2019, 7:57 PM IST

bandaru-dattatreya

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వడమేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపితే ఎమర్జెన్సీని తలపించేలా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి వివరిస్తామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేస్తున్న నిరహార దీక్షను భగ్నం చేసేలా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆక్షేపించారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని, మే 2వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నామని, అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మే రెండున రాష్ట్ర బంద్​: బండారు దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details