తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandaru Dattatreya: ప్రొఫెసర్ రావు మృతి పట్ల బండారు దత్తాత్రేయ సంతాపం - himachal pradesh governor bandaru dattatreya latest news

మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎం రావు మృతి తననెంతో బాధపెట్టిందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు వివరించారు.

Bandaru Dattatreya mourns the death of Professor nvrlm Rao
ప్రొఫెసర్ రావు మృతి పట్ల బండారు దత్తాత్రేయ సంతాపం

By

Published : Jun 13, 2021, 4:32 PM IST

మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎం రావు మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్ రావు అందరితో కలుపుగోలుగా మాట్లాడే వారని దత్తాత్రేయ తెలిపారు.

ఆయన మృతితో తాను అత్యంత ఆప్తున్ని కోల్పోయానని బండారు దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details