తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఈసీని కలిసిన దత్తాత్రేయ"

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఈసీ రజత్ కుమార్​ను కలిశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు విషయంలో అవకకవకలు జరిగాయని వాటిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.

By

Published : Mar 2, 2019, 4:18 PM IST

"ఈసీని కలిసిన దత్తాత్రేయ"

"ఈసీని కలిసిన దత్తాత్రేయ"
గల్లంతైన ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈసీనికేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. దత్తాత్రేయతో పాటు భాజపా నేతలు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ను కలిసి వినతిపత్రం అందించారు. 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలోని నాలుగు లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారు. లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నందున తొలగించిన ఓట్ల విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయ్ సంకల్స్ దివస్ కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని చెప్పినప్పటికీ తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఇవీ చదవండి:ప్రభాకర్ రావు నామినేషన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details