నగర సుందరీకరణ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ప్రధాన రహదారులు, కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దని లోకేష్ కుమార్ అన్నారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో జరిగిన సిటీ సమన్వయ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. ఈ విషయంలో అన్ని విభాగాల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
'బ్యానర్లను పూర్తిస్థాయిలో నిషేదించాలి'
నగరంలో అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటును పూర్తిస్థాయిలో నిషేదాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు అమలు చేయాలని సిటీ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో అన్ని విభాగాల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారికి జరిమానాలను విధించడం, అవసరమైతే కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో జోనల్, డిప్యూటి కమిషనర్లు కఠినంగా వ్యవహరించాలన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా నిర్వహించే అన్ని పార్కులకు ఎస్‌టీపీల ద్వారా శుధ్దిచేసిన జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించాలని పేర్కొన్నారు. ఈ నెల 20 తేదీలోపు జీహెచ్ఎంసీలోని రహదారులపై గుంతలను పూడ్చడం, ప్యాచ్‌వర్క్‌ల నిర్మాణాలను పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వెంకట నర్సింహా రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్‌ను ఢీకొట్టారు...