తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నోడి చేతులు విరగ్గొట్టారు - injury

బాలుడిని ఎత్తుకెళ్లి రెండు చేతులు విరగ్గొట్టాడు ఓ కిరాతకుడు. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలుడిని ఎత్తుకెళ్లి చేతులు విరగ్గొట్టిన దుండగుడు

By

Published : Feb 26, 2019, 8:17 AM IST

Updated : Feb 26, 2019, 7:19 PM IST

బాలుడిని ఎత్తుకెళ్లి చేతులు విరగ్గొట్టిన దుండగుడు

హైదరాబాద్​లోని​ యాకుత్​పురాకు చెందిన ఆరేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లి రెండు చేతులు విరగ్గొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసీఫ్‌, ఆఫ్రిన్‌ దంపతుల కుమారుడు నాసీర్‌ సోమవారం ఉదయం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా జాడ దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కుటుంబసభ్యులు బాలుడి కోసం గాలిస్తుండగా యాకుత్‌పురా, డబీర్‌పురా మధ్య ఉన్న రైల్వే కట్ట సమీపంలోని కంప చెట్లలో నిస్సహాయ స్థితిలో నాసీర్ కనిపించాడు. రెండు చేతులు విరిగిపోయి తీవ్రగాయాలతో ఉన్న బాలుడిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఇక్కడ మొండెం-అక్కడ తలభాగం'

Last Updated : Feb 26, 2019, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details