Balmuri Venkat Files Petition in HC against CM KCR :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడతున్న సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అగ్ర పార్టీలు ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తుండగా.. ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అనంతరం సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించక ముందే కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని విమర్శించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు బల్మూరి వెంకట్ చెప్పారు. తాను వేసిన పిటిషన్ ఈ నెల 16న విచారణకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Political Parties Reaction on MP Knife Attack : మరో 4 రోజులు ఐసీయూలోనే చికిత్స.. కోడికత్తంటూ అపహాస్యం చేసినవారిపై హరీశ్‌రావు కౌంటర్
Congress Complaints on BJP, BRS to EC :మరోవైపుపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేయని వ్యాఖ్యలను చేసినట్లు వీడియోను మార్ఫింగ్ చేసి పార్టీకి నష్టం కలిగించేట్లు బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ పరువు తీయాలన్న లక్ష్యంతో మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న బీజేపీ నాయకులు, మరికొందరు గుర్తు తెలియని వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరారు.
ఇటీవలి కాలంలో తమ కేడర్ సామాజిక మాధ్యమాలు, ట్విటర్, ఇతర అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సాధారణ ఓటర్లను తప్పుదారి పట్టించే వార్తలను తాము గమనించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితికి కొందరు అజ్ఞాత వ్యక్తులు క్రియాశీల సహకారంతో సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పోలీసులతో బెదిరించి - నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారు : కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన అర్జీతో పాటు కల్పిత, చెలామణిలో ఉన్న కంటెంట్‌ను జత చేసినట్లు ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి చెప్పారు. మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేట్లు పోస్టులు పెడుతున్న ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మరో వైపు అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి రాజకీయంలో నాటక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.